RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
13-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని ఖండిస్తున్నాం

– మాల మహానాడు జేఏసీ డిమాండ్ నంద్యాల: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జేఏసీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. నంద్యాలలోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీ పుల్లయ్య మాట్లాడుతూ.. దేశంలోని దళితులు, గిరిజనులు, బీసీలు…

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన

నంద్యాల: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడటాన్ని నిరసిస్తూ మంగళవారం నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ, ఏపీఎమ్‌ఎఫ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పాత్రికేయులపై, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యం చేయడం అమానుషమని, జర్నలిస్టుల భద్రతకు తక్షణమే బలమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వార్తల కవరేజ్ ఎలా చేయాలో పోలీసులు నిర్దేశించడం సరికాదని, అన్యాయాలను ఎండగడుతున్న పాత్రికేయుల…

అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం/ఉరవకొండ, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని (ప్రోగ్రెస్ కార్డ్) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ఇందులో సమగ్రంగా పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. ఉరవకొండ తాగునీటి సదుపాయం, హంద్రీ-నీవా…

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఫాదర్ తోట జోసెఫ్

కర్నూలు: పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదని, ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఆశయంతో కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (కేడీఎస్ఎస్) డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్ అందిస్తున్న సేవలు అభినందనీయంగా నిలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థుల కుటుంబ పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారు ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. చదువు బాలల…

అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం/ఉరవకొండ, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని (ప్రోగ్రెస్ కార్డ్) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ఇందులో సమగ్రంగా పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. ఉరవకొండ తాగునీటి సదుపాయం, హంద్రీ-నీవా…

ఉచిత దంత వైద్య శిబిరం

– వైద్య పరీక్షలు, మందుల పంపిణీ నంద్యాల, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 15వ వార్డు గిరినాథ్ సెంటర్‌లో అడ్వకేట్ సన్నల సాయిరామరెడ్డి ఆధ్వర్యంలో, కేఎమ్ డెంటల్ కేర్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దంత వైద్య నిపుణులు ఆదివారం స్థానిక ప్రజలకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఎక్స్ రే ద్వారా సమస్యలను వివరించి తగిన చికిత్స సలహాలు అందించారు. అంతేకాకుండా, బాధితులకు ఉచితంగా మౌత్…

ఆడపిల్లలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. బ్రతకనిద్దాం

నంద్యాల, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ శారదా బాయి ఆధ్వర్యంలో ఆదివారం వైద్య సిబ్బంది, ఆర్.ఆర్. నర్సింగ్ విద్యార్థులతో సమావేశం మరియు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా బాయి మాట్లాడుతూ.. ఆడపిల్లలను సమాజంలో మగబిడ్డలతో సమానంగా చూడాలని, వారిని బ్రతకనిచ్చి ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చెప్పడం పిసిపిఎండిటి చట్టం…

నందికొట్కూరులో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు: వైభవంగా శ్రీనివాస కల్యాణం

నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణ సమీపంలోని బొల్లవరం గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సామాజిక సేవా కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు కనులపండువగా సాగాయి. నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, శ్రీ చౌడేశ్వరి…

సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పేద, బడుగు, బలహీన వర్గాలు నివసించే కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 17.50 కోట్ల వ్యయంతో 9.70 కిలోమీటర్ల మేర చేపడుతున్న సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. టిఎస్ఎస్ఆర్ నగర్, అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతం, పటేల్ సెంటర్ నుండి గుడ్డు…

26వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె: సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బనగానపల్లె: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బనగానపల్లె మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలని, 70 శాతం ప్రమోషన్లు కల్పించాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని మరియు 60 ఏళ్లు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో…